ప్రజాగళం సభ అనంతరం ప్రధాని మోదీతో మాట్లాడిన చంద్రబాబు, పవన్

  • ముగిసిన ప్రజాగళం సభ
  • ప్రజాగళం సభ పట్ల హర్షం వ్యక్తం చేసిన మోదీ
  • ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించబోతోందని ధీమా
  • ఏపీలో పరిస్థితులను మోదీకి వివరించిన చంద్రబాబు, పవన్
పల్నాడు జిల్లా బొప్పూడి వద్ద ఎన్డీయే కూటమి నిర్వహించిన ప్రజాగళం సభ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్రమోదీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రజాగళం సభ పట్ల హర్షం వ్యక్తం చేశారు. సభ బాగా జరిగిందని, ప్రజల్లో ఉత్సాహం కనిపించిందని వారితో చెప్పారు. ఎన్డీయే కూటమి ఘనవిజయం అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, చంద్రబాబు అరెస్ట్, ఆరోగ్యం గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. ఇక, ఏపీలో రాజకీయ పరిస్థితులను ప్రధానికి చంద్రబాబు, పవన్ వివరించారు. ఏపీలో వ్యవస్థల విధ్వంసం జరుగుతోందంటూ పలు అంశాలను మోదీ ఎదుట ప్రస్తావించారు.

Narendra Modi
Chandrababu
Pawan Kalyan
Praja Galam
Boppudi
TDP-JanaSena-BJP Alliance

More Telugu News